సంక్రాంతి ప్రత్యేకతలు…

whatsapp-image-2017-01-13-at-7-12-01-am
సూర్యుడు మరకరాశిలోకి ప్రవేశించడంతో పువ్వులు వికసిస్తాయి, ఆహార సంపదలు రైతుల ఇండ్లలో అధికంగా చేరుతాయి.
భోగి విశిష్టత…
భోగి పండుగ రోజున ఇళ్ల ముందు ఆవుపేడతో కళ్లాపి చల్లి వాటిలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్లో గరిక, తంగెడుపూలు, పిండిగొమ్మలు, పసుపు, కుంకుమబొట్టు పెట్టి చుట్టు బంతి పూలు, రేగు పండ్లు చల్లి వాటి చుట్టూ నవ ధాన్యాలు చల్లుతారు. వీటిలో ఆయుర్వేద విశిష్టత ఉంది. ఆవుపేడతో చేసిన పిడకలను భోగి రోజు మంటల్లో వేసి ఉష్ణాన్ని పెంచుకుంటారు. మరుసటి రోజు నుంచి చలితగ్గడం ప్రారంభమవుతుంది. వాటి ఉపయోగం కింది విధంగా ఉంటుంది.
ఆవుపేడ…
* సూక్ష్మ క్రిమిసంహరిణిగా పనిచేస్తుంది.
* ప్రకృతి కాలుష్యనివారిణి
* ఉష్ణ ఉత్పత్తి ఉపయోగాలు ఉండడంతో భోగి మంటల్లో పిడకలుగా వేస్తారు.
గరిక…
* గరికలో అనేక ఔషధగుణాలున్నాయి.
* పచ్చిగరికను మెత్తగా నూరి దెబ్బలపై పుస్తే మానిపోతాయి.
* ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది.
* వైపరీత్యాలను తొలగించే శక్తి ఉంటుంది.
* దగ్గు, అయాసం, మలబద్ధకం నివారిస్తుంది.
పిండిగొమ్మలు (ఉత్తరేణి)…
* ఉత్తరేణి పుల్లలతో పళ్లు తోమడం ద్వారా దంతక్షయం నివారించవచ్చు.
* జీర్ణవ్యాధులు, త్రిదోష, ఉదరవ్యాధుల నివారిణి.
* పైత్యరసం ఉత్పత్తిలో ప్రాత వహిస్తుంది.
* రక్త వృద్ధి పెంచుతుంది.
తంగేడు పూలు…
* కఫం, అతి మూత్ర వ్యాధిని నివారిస్తుంది.
* పువ్వులు కషాయంగా చేసుకుని చేవిస్తే వ్యాధి నివారిణిగా పనిచేస్తుంది.
* కాయలు క్రిమిరోగ, మలబద్ధక నివారిణిగా పనిచేస్తాయి.
* కంటిచూపు మెగురుపడుతుంది.
* వివిధ ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు.
పుసుపు…
* క్రిమిసంహారిణి, కామెర్ల వ్యాధి నివారణలో ప్రాత వహిస్తుంది.
బంతిపూలు…
* రక్తవృద్ధికి, చెవిపోటు నివారణకు ఉపయోగపడుతుంది.
* పొత్తి కడుపులో నొప్పి, పుండ్లను నివారిస్తుంది.
* పురుషుల్లో వీర్యవృద్ధి జరుగుతుంది.
* కఫం నివారణతోపాటు సంతోషంగా ఉండడంలో ఉపయోగపడుతుంది.
* జఠరదీప్తిగా పనిచేస్తుంది.(జఠరస్రవాల ఉత్పత్తి)
రేగుపండ్లు…
* పులుపు, వగరు, చేదుగా ఉంటాయి. వీటిలో ఔషధగుణాలు అధికం.
* వాతం, మేహం, మూలవ్యాధి నివారణి
* రక్తం శుభ్రం చేయడంలో, ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది.
* శరీరంలో వేడిపుట్టిస్తుంది. చలువచేస్తుంది.
* విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది. ఎముకలు అతకడంలో సహాయ పడుతుంది.
సంక్రాంతి పొంగలిలో…
సంక్రాంతి నాడు చేసే పొంగలికి బియ్యం, నవ్వులు, బెల్లం ఉపయోగిస్తారు. దీనితోపాటు పండుగ రోజు పిండితో అరిసెలు చేస్తారు వీటిలో కూడ పోషక విలువలు అధికంగా ఉంటాయి.
బియ్యం…
* కడిగిన బియ్యం నీటిని పంచదారతో సేవించడం వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది.
* దప్పిక తగ్గుతుంది. వేసవిలో ఎండను తగ్గిస్తుంది.
* తిదోషహరిణిగా పనిచేస్తుంది.
* శరీరానికి కార్బోహైడ్రెట్లు అధికంగా అందుతాయి.
నువ్వులు…
* శరీరంలో ఉష్ణ ఉత్పత్తిని పెంచుతాయి.
* ఔషధ గుణం ఉంటుంది.
* మూత్ర వ్యాధులను తొలగిస్తుంది.
* రక్తం వృద్ధి చేస్తుంది.
* ఎముకలు అరిగిపోయినప్పుడు వాటిని సరిచేయడంలో (ఎముక మజ్జ ఉత్పత్తి)పాత్ర వహిస్తుంది.
బెల్లం…
* రక్తవృద్ధిగా పనిచేస్తుంది.
* శరీరంలో ఖనిజలవణాలను పెంచుతుంది.
* ఉష్ణ, తుష్టి, శరీరంలో కాంతిని పెంచుతుంది.
* కోప, తాపాలను తగ్గిస్తుంది.
* హృద్రోగనివారిణిగా పనిచేస్తుంది.
* సర్వదోష లక్షణాలు ఉంటాయి.
గోధుమలు…
* శరీరానికి బలాన్నిస్తాయి.
* వాతం నివారణకు తోడ్పడుతాయి.
ధాన్యాల్లో…
వరి, శనగలు, మినుములు, నువ్వులు, కందులు, జొన్నలు, సజ్జలు, పెసర్లు, బొబ్బర్లు, ఉలువలు ఉంటాయి. వీటితో వివిధ రకాల ఆహార పదార్థాలను చేసుకుని తింటారు. వీటిలో కూడా ఔషధగుణాలు ఉంటాయి.
శనగలు…
* పచ్చివి తింటే రక్తవృద్ధి జరుగుతుంది.
* దేహపరిపుష్టికి ఉపయోగపడుతాయి.
* శక్తిని అందిస్తాయి.
మినుములు…
* పురుషుల్లో వీర్యవృద్ధికి..
* శరీరంలో మాంసకృతుల వృద్ధికి ఉపయోగపడుతాయి.
* ఉష్ణాన్ని పెంచుతుంది.
జొన్నలు…
* తెలుపు, పసుపుగా ఉంటాయి. వీటిలో శరీరానికి బలం పెంచే శక్తి ఉంటుంది.
* వీర్యవృద్ధి జరుగుతుంది. గ్లూకోజు స్థాయిని నియంత్రిస్తుంది.
* మల, మూత్ర జారీలో పాత్ర వహిస్తుంది.
* కఫం బాధ నివారిణిగా పనిచేస్తుంది.
సజ్జలు…
* శరీరానికి బలవర్థకమైన ఆహార పదార్థాలు.
* ప్రోటీన్లు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.
* పిండిని రొట్టెలుగా చేసుకుంటే రుచిగా ఉంటాయి.
కందులు…
* ఇవి తెలుపు, నలుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి.
* ఉష్ణ, శీతల నివారిణి.
* వాత నొప్పులు, మలబద్ధకం నివారిస్తాయి.
పెసర్లు…
* వీటిలో శరీరంలో మేహశాంతి నివారణ శక్తి ఉంటుంది.
* కండ్లకు మంచివి.
* రక్త, పైత్యం, కఫం తగ్గించుటలో ఉపయోగపడుతుంది.
బొబ్బర్లు…
* మూత్రశుద్ధిలో ఉపయుక్తి
* శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది.
* స్త్రీలల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి.
ఉలువలు…
* మధుమేహ నివారణలో పనిచేస్తుంది.
* శ్వాసక్రియలో పనిచేస్తుంది.
* మలబద్ధక నివారిణిగా పనిచేస్తుంది.
సంక్రాంతి పిండి వంట అరిసెలు…
* బియ్యం పిండితో చేసే అరిసెల్లో దేహపుష్టిని పెంచే లక్షణం అధికంగా ఉంటుంది.
* రుచిగా ఉండంతోపాటు బలాన్నిస్తాయి