మీ పేరులోని మొదటి అక్షరంతో మీ వ్యక్తిత్వం

ఒకమనిషి గురించి మాట్లాడేటప్పుడు అతని వ్యక్తిత్వం తెలుసుకోవడానికి వారి ఆలోచనలు, నమ్మకాలు, వారి ఎటువంటి వస్తువులంటే ఇష్టపడుతారు. వారి వెళ్ళేచోటు, ఒకరి గురించి ఇంకొకరితో ఎలా మాట్లాడుతారు.. వారు తినే ఆహారం.. ఇలా అనేక అంశాల ఆధారంగా వారి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వవాన్ని చెబుతారు జ్యోతిష్యులు. అలాగే వారు పెట్టుకున్న పేరును బట్టి కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పేరు లో మొదటి అక్షరంతో వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు. ఇంతకూ ఏ అక్షరంతో పేరు మొదలయితే ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుందో వరుసగా చూద్దాం..

A: వీరు చాల సాహసవంతులు మరియు నమ్మదగిన వారు. అందం అంటే చాలా ఇష్టపడతారు ఎవరి సహాయం లెకుండా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటారు.

B: వీరు జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు. ఎమోషన్స్ కాస్త ఎక్కువ.

C: వీరు మనసులో దాగి ఉన్న విషయాలు అన్నీ బయటకి చెప్పేస్తారు. ఇండిపెండెంట్ గా జీవించండం, ఇతరులతో పోటీపడడం వీరికి ఇష్టం.

D: వీరికి ఇతరులతో కలిసి తిరగడం, మాటలు చెప్పడం ఇష్టం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం వీరి టాలెంట్.

E: వీరు స్నేహం అంటే ప్రాణం ఇస్తారు. అందరూ తమ వాళ్లేనని భ్రమిస్తారు.

F: వీరు ఏ విషయాన్నయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

G: వీరు అనుకున్నది సాధించేంతవరకూ లక్ష్యంపైనే గురి ఉంటుంది.

H: వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. ఓడిపోయినా సరే మొక్కవోని దీక్షతో ప్రయత్నిస్తుంటారు.

I: వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. అందరిలో ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు.

J: వీరు జరిగిపోయిన విషయం గురించి ఆలోచించకుండా జరగవలసిన దాని గురించి ఆలోచిస్తారు.

K: వీరు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కాని సిగ్గు ఎక్కువ.

L: వీరు ఏదైనా సరే కష్టపడితేనే సాధ్యం అని భావిస్తారు. ఉన్నతమైన జీవితం, అందాన్ని కోరుకుంటారు.

M: వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం. నమ్మకస్తులు, తెలివితోపాటు ధైర్యం, కష్టపడే తత్త్వం ఎక్కువే.

N: వీరికి ఏమి చేయాలో, ఎలా చెయ్యాలో క్లారిటీ ఉంటుంది. కాని చేసే ప్రయత్నంలో తప్పు జరిగితే తిరిగి సాధించే స్వభావం ఉంటుంది.

O: వీరికి జీవితమంటే కుటుంబం గౌరవం, నీతి నిజాయితీ అని భావిస్తారు.

P: వీరు జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అనుకుంటారు.

Q: వీరికి డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. కొంచెం కొత్తగా ఆలోచిస్తారు.

R: వీరు ఎదుటివారు కష్టాల్లో ఉంటే తట్టుకోలేరు. ప్రతి చిన్న విషయాన్ని చూసి వేంటనే చలిస్తారు.

S: వీరు చాల అందంగా వుంటారు. కుటుంబం, స్నేహం అంటే చాలా ఇష్టం.

T: వీరు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ బిజీ గా ఉంటారు.

U: వీరు అనుకున్నది సాధించాలంటే కష్టపడడమే సరైనదారి అని గట్టిగా నమ్ముతారు.

V: వీరికి ముందు చూపు ఎక్కువ. నా అనే స్వార్థం కుడా ఎక్కువే.

W: వీరు ప్రతి ఒక్కరితో కలిసిపోయి ప్రేమగా మాట్లాడుతారు.

X: వీరు చాలా ప్రశాంతవంతమైన స్వభావం కలిగి వుంటారు.

Y: వీరికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇండిపెండెంటు గా వుంటారు.

Z: వీరికి టెక్నాలజీ మరియు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి ఉంటుంది.